భారత్‌లో వాతావరణ పరిస్థితులపై షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) ఈ నివేదిక ప్రకారం.. 2024 మొదటి తొమ్మిది నెలల్లో భారతదేశం 93 శాతం రోజులు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. 274 రోజులలో 255 రోజులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విపరీతమైన వేడి, చలి, తుఫాను, వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల ప్రభావితమైనట్లు నివేదిక చూపుతోంది. ఈ విపత్తులు 3,238 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 2.35 లక్షలకు…