Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలన్నారు. సవాళ్ళు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి.. డోలీరహిత గిరిజన నివాసాలు ఉండాలన్నాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు.