(అక్టోబర్ 10న రేఖ పుట్టినరోజు) ఆరున్నర పదుల వయసు దాటినా, అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఉత్తరాదిన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. అనేక హిందీ చిత్రాలలో రేఖ అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ నాటికీ నవతరం భామలకు దీటుగా వెలుగులు విరజిమ్ముతోన్న రేఖ అందాన్ని చూసి, ఆ నాటి ఆమె కథానాయకులు అబ్బుర పడుతూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగానూ నిలచిన రేఖ,…