Nirosha: ఇటీవల దొంగలు ఆచి తూచి సెలబ్రిటీల ఇళ్లకే కన్నాలు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు చెందిన వారి ఇళ్లలో దొంగతనాల వార్తలను మనం వింటూనే ఉన్నాం. గతంలో ఐశ్వర్య రజనీకాంత్, శోభన, సింగర్ విజయ ఏసుదాస్ లాంటి వారు ఇళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే.