ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్క వినాయగం అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. సమాచారం ప్రకారం సోమవారం అడయార్‌లోని వినాయగం నివాసంలో గాయకుడికి అంత్యక్రియలు చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. విషయం తెలిసిన పలువురు సెలెబ్రిటీలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వినాయగం ‘నాట్యాచార్య పద్మశ్రీ’ వజువూరు బి. రామయ్య పిళ్లై చిన్న కుమారుడు. వినాయకం తమిళంతో పాటు ఇతర…