(సెప్టెంబర్ 2న సుదీప్ పుట్టినరోజు) తెలుగువారికి సైతం కన్నడ నటుడు సుదీప్ పేరు సుపరిచితమే! కొన్ని తెలుగు చిత్రాలలోనూ, మరికొన్ని అనువాద చిత్రాలతోనూ తెలుగువారిని ఆకట్టుకున్నారు సుదీప్. ఆయన నటనలో వైవిధ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. విలక్షణమైన పాత్రల కోసం సుదీప్ పరితపించడమూ తెలిసిపోతుంది. కన్నడ నాట స్టార్ హీరోగా సక్సెస్ రూటులో సాగుతున్న సుదీప్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనను పలకరించిన విలక్షణమైన పాత్రల్లోకి ఇట్టే పరకాయప్రవేశం చేసి మెప్పించారు. కన్నడ చిత్రసీమలో ‘కిచ్చ’ సుదీప్…