Acharya Pramod Krishnam: కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లే, ఆయన ఇండియా కూటమికి ‘‘పిండప్రధానం’’ చేస్తారని కల్కిథామ్ పీఠాధీశ్వర్ ప్రమోద్ కృష్ణం విరుచుకుపడ్డారు.
Kalki Dham Temple: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో కల్కిధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆలయ శంకుస్థాపన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. యూపీ అంతటా రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలో లోక్‌సభ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (ఆచార్య ప్రమోద్) స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.