దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది జరిగిన ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో సంగారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.