Home
Acb
Acb News
-
Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..
శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తుండటం జంట నగరాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఇన్స్పెక్టర్ల వరకు కొందరు అధికారులు అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలకు తెగబడుతూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. తాజాగా కుల్సుంపుర సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న 2024 బ్యాచ్ మహిళా ఎస్సై వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. కనీసం ప్రొబేషనరీ కాలం కూడా… -
Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
Rajasthan: రాజస్థాన్‌లో ఐఏఎస్-ఐపీఎస్ దంపతుల విల్లాలు, కాటేజీల కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌ను ఏపీఓ (అవైటింగ్ పోస్టింగ్ ఆర్డర్స్)లో ఉంచగా, ఇప్పుడు ఆయన భార్య ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రశాఖ మాథూర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈమెను కూడా ఏపీలో కింద ఉంచాలని రాష్ట్ర సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆస్తుల కొనుగోలు, లీజు ఒప్పందాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో శిఖర్… -
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
Hyderabad: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ను ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. లక్ష్మీభాస్కర్ అరెస్టు అనంతరం నిమ్స్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ, సుమారు 20 మంది అధికారులతో కూడిన బృందంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు విస్తృత సోదాలు… -
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
Hyderabad-Telangana ACB: "లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం".. ఈ సూక్తి ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు కనిపిస్తుంది. ఇప్పటివరకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితేనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేస్తారనే భావన ఉండేది. కానీ, అధికారులు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినా నేరమేనని, జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఏసీబీ సరికొత్త సంప్రదాయానికి నాంది పలికింది. కేవలం లంచం డిమాండ్ చేసినందుకు గాను బంజారాహిల్స్ సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) విజయ్ను అరెస్ట్ చేసి అవినీతి… -
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
Bribe in Dead Drop Method: లంచం తీసుకోవడంలో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారనే ఆరోపణలతో టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీకి చిక్కిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా డ్రగ్స్ సరఫరాలో వినియోగించే ‘డెడ్ డ్రాప్’ తరహాలోనే లంచం డబ్బులు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త నుంచి లంచం కోసం సునీత ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో కనీసం… -
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
India vs Afghanistan: భారత క్రికెట్ జట్టు మరోసారి ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం, ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే.. మ్యాచ్‌లు భారత్‌లో జరిగినప్పటికీ, ఈ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు… -
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ (R&B) శాఖ మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ వ్యవహారంలో సంచలన మలుపు చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితమే మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసిన అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు, తాజాగా ఆయన బినామీలపై నిఘా పెట్టారు. అధికారిక లెక్కల ప్రకారం మోహన్ నాయక్ సుమారు రూ. 17 కోట్ల మేర అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అక్రమ సంపాదనకు సంబంధించిన లింకులను… -
DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
DSP Bhim Reddy Arrest: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. భీమ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై నిర్వహించిన సోదాలు, విచారణల అనంతరం ఈ కీలక చర్య చేపట్టినట్లు సమాచారం. ఇంతకుముందు భీమ్ రెడ్డి అనారోగ్య కారణాలను చూపడంతో ఆయనను వెంటనే అరెస్ట్ చేయకుండా ఏసీబీ నోటీసులు… -
Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
Narahari Rao : ప్రభుత్వ విభాగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) తన ఉచ్చును మరింత బిగిస్తోంది. సర్వే , ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సుంకరి నరహరి రావు అక్రమార్జనపై ఏసీబీ అధికారులు జరుపుతున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆయనకు సంబంధించిన ఆస్తుల తనిఖీల్లో భాగంగా తాజాగా నిర్వహించిన సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బ్యాంక్ లాకర్లో నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం నరహరి రావు… -
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఈఎన్సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్‌లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మోహన్ నాయక్ ఈఎన్సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు…
తాజావార్తలు
-
Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
-
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
ట్రెండింగ్
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?