DSP Bhim Reddy Arrest: DSP భీమ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSP Bhim Reddy Arrest: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. భీమ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై నిర్వహించిన సోదాలు, విచారణల అనంతరం ఈ కీలక చర్య చేపట్టినట్లు సమాచారం.
ఇంతకుముందు భీమ్ రెడ్డి అనారోగ్య కారణాలను చూపడంతో ఆయనను వెంటనే అరెస్ట్ చేయకుండా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేయడంలో జాప్యం జరగడంతో ఏసీబీ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అరెస్ట్ అనంతరం భీమ్ రెడ్డికి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనను ఏసీబీ కార్యాలయం నుంచి ప్రత్యేక భద్రత మధ్య తరలించారు.
Also Read
ప్రస్తుతం భీమ్ రెడ్డిని జడ్జి నివాసం ముందు హాజరుపరచేందుకు ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!