తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ బుధవారం నామినేట్ చేసింది. బీఆర్‌ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నందున, సింఘ్వీకి సీటు కోసం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ తన బలంపై ఆధారపడే అవకాశం ఉంది.…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా గాంధీని ఈనెల 8న హాజరు కావాలని కోరగా.. రాహుల్ గాంధీని అంతకన్నా ముందే జూన్ 5న హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి ఈడీ సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీ ఈడీ సమన్లకు కట్టుబడి ఉన్నారని…