అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ భారీ విజయం అందుకుంది. దుబాయ్ వేదికగా మంగళవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ (5/22) మలేషియా పతనాన్ని శాసించాడు. 409 పరుగుల లక్ష్య ఛేదనలో మలేషియా 93 పరుగులకే ఆలౌట్ అయింది. మలేషియా జట్టులో హంజా పంగి (35) టాప్ స్కోరర్. డీయాజ్ పాత్రో (13), ముహద్ అఫినిద్ (12) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు.…