(అక్టోబర్ 5న వాగ్దానంకు 60 ఏళ్ళు) తెలుగు నాట నవలానాయకునిగా జేజేలు అందుకున్నారు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆరంభంలో బెంగాలీ నవలలతోనే అక్కినేని పలు విజయాలు చవిచూశారు. దేవదాసు బెంగాలీ నవల ఆధారంగా రూపొందిన చిత్రంతోనే ఏయన్నార్ కు మహానటుడు అన్న ఇమేజ్ లభించింది. దాంతో వరుసగా కొన్ని బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. అవి సంతృప్తి కలిగించాయి. ఈ నేపథ్యంలో దేవదాసు నవల రచయిత శరత్ బాబు రాసిన దత్త నవల…