చండీగఢ్ (Chandigarh) సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ట్విస్టులే చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా ఈ రెండు పదవులను కమలం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆప్-కాంగ్రెస్ కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఇటీవల మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరగడంతో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్‌కు సంపూర్ణ మద్దతు ఉన్న కూడా బీజేపీ అభ్యర్థే విజయం సాధించినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎనిమిది ఓట్లు చెల్లనివిగా పరిగణించారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అధికారి తీరును తప్పుబడుతూ.. ఆప్ అభ్యర్థి విజయం సాధించినట్లుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించారు.
తాజాగా సోమవారం జరిగిన సీనియర్ డిప్యూటీ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ రీపోలింగ్ ఎన్నికల్లో ఆ పదవులను బీజేపీ సొంతం చేసుకుంది.
చండీగఢ్ మున్సిపల్ హౌస్‌లో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో బీజేపీకి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సింగ్ సంధుకు 19 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా ఆప్ మేయర్ ప్రకటించారు. అయితే ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. దీంతో మున్సిపల్ హౌస్‌లో బీజేపీ మద్దతు పెరిగింది. దీంతో రెండు పదవులను సొంతం చేసుకోగలిగారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీ అభ్యర్థి రాజేందర్ శర్మ దక్కించుకోగలిగారు. ఒక ఓటు చెల్లలేదని మేయర్ వెల్లడించారు.
35 మంది సభ్యులున్న మున్సిపల్ సభలో బీజేపీకి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఫిబ్రవరి 19న ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 14 నుంచి 17కి పెరిగింది. ఇక ఆప్ (AAP)కి 10 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్ ఉన్నారు. అలాగే బీజేపీ సభ్యుడైన చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్‌కు కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కూడా ఓటు హక్కు ఉంది. దీంతో బీజేపీకి సంపూర్ణ బలం ఉండడంతో సీనియర్, డిప్యూటీ మేయర్ పదవులను బీజేపీ సొంతం చేసుకోగల్గింది.
ఇక జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 20న సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను నగర కొత్త మేయర్‌గా ప్రకటించింది. మొత్తానికి చండీగఢ్ మేయర్ పదవుల్లో ట్విస్టులు మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి.