మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే కేసీఆర్ ను దళితులు విశ్వసిస్తారన్న ఎ.చంద్రశేఖర్… రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడేళ్ళ తర్వాత సీఎం కేసీఆర్ కు దళితులు గుర్తురావటం సంతోషకరమని… దళితులు అండగా ఉండబట్టే ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళగలిగారని తెలిపారు. ఉద్యమంలో దళితులు తిండికి లేక ఇబ్బంది పడితే.. కేసీఆర్ ఒక్క రోజు కూడా ఉపవాసం…