భారత వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు (ఆదివారం) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వైమానిక దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. వారి గొప్ప సేవ, త్యాగం మన గగనతల భద్రతకు భరోసానిస్తుందని అన్నారు. భారత వైమానిక దళం యొక్క ధైర్యసాహసాలు, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.