దీపావళి పండగ వేళ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అందించే వడ్డీని దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది. దీంతో దాదాపు 6.5 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు పండగకు ముందే అందించనున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ విషయమై త్వరలోనే…