‘అజరామరం’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన కొన్ని కళాఖండాలు ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ‘అజరామర చిత్రం’ అంటే 1963లో రూపొందిన ‘లవకుశ’ తరువాతే ఏదైనా అనేవారు ఎందరో ఉన్నారు. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా తెరకెక్కిన ‘లవకుశ’ 1963 మార్చి 29న విడుదలయింది. నభూతో నభవిష్యత్ అనదగ్గ విజయం సాధించింది. అరవై ఏళ్ళవుతూ ఉన్నా, ఆ సినిమాను అధిగమించిన మరో పౌరాణికం మనకు కానరాదు. అలాగే ఆ చిత్రం దక్షిణాదిన కోటి రూపాయలు వసూలు చేసిన…