భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కాన్పూర్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చాలా దూరం ప్రయాణించి స్టేడియంకు చేరుకుంటున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లి వీరాభిమాని దాదాపు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కి స్టేడియానికి వచ్చాడు.