ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కీలక నిర్ణయం తీసుకుంటూ.. వివరాలను ప్రకటించింది. వచ్చే వేతనాల నుంచి అందుకునేలా 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు, మూల వేతనంపై 5 శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు…