సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఆ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ పొందగా, వారిలో 41 మంది మహిళలు ఉండగా.. 195 మందిలో 166 మంది ఐపీఎస్ అధికారులు, వారిలో 37 మంది మహిళలు.