ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే మెజార్టీ పదవుల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కూర్చోబెట్టిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది.. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్..