ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓవర్‌లోడ్‌తో కూడిన బస్సు లోతైన లోయలో పడడంతో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.