కరోనా అయిపోయింది అనుకోవద్దు..అందరూ రెండు డోసులు తీసుకోవాలి.. కరోనా ప్రభావం ఉంది.. వాక్సిన్ తీసుకున్న వాళ్లకు ప్రమాదం లేదన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా, ప్రజలంతా అప్రమత్తంగా వుండాలన్నారు. థర్డ్ వేవ్ వస్తుందో రాదో తెలియదని, ప్రభుత్వం మాత్రం సన్నద్దంగా ఉందన్నారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఇకపై ఆక్సిజన్ లోటు రాదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తవుతోందన్నారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో…