ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ 22బెట్ ఇండియాకు అతను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటననలు ఇటీవల వెల్లువెత్తాయి.