2024-25 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. దిగువ సభ కూడా మూజువాణి ఓటు ద్వారా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను ఆమోదించింది. వీటికి సంబంధించిన విభజన బిల్లును కూడా సభ ఆమోదించింది. బడ్జెట్ చర్చకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 2024-25 మధ్యకాలంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.9 శాతానికి, 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.…
భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని అభివృద్ధి చెందిన దేశంగా మారడం అనేది కలగా మిగిలిపోరాదని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా…
2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందినదిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్నోవేషన్, సమ్మిళిత వృద్ధిపై దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.