Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు రికార్డు స్థాయిలో సాగింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు సమర్పించారు. దీంతో తెల్లవారు జామున మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.