జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ పూర్తి చేసినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి విలేకరులకు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.