Maharashtra NCP: నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నుంచి, ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లిస్ట్‌లో వెలుగులోకి వచ్చిన విశేషమేమిటంటే.. 95% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు దక్కడం. ఈ జాబితాలోని ప్రముఖ నాయకుల్లో…