నిండు నూరేళ్లు బతకాల్సిన బాలిక 13 ఏళ్లకే కనుమరుగైంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రోజున 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడింది. కాగా.. బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు అని బయటికొచ్చి.. స్కూల్ బస్సు రాకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వెళ్లింది.