పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్‌లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు.