ఏ గీత రచయితకైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కసారైనా ఉత్తమ గీత రచయితగా నిలవాలన్న అభిలాష ఉంటుంది. తెలుగు చిత్రసీమలోనూ అలాంటి కోరికతో ఎంతోమంది గీతరచయితలు సాగుతున్నారు. కొందరిని అవార్డులు వరించాయి. కొందరి పాటలు మురిపించినా, జనం రివార్డులతోనే సరిపుచ్చుకోవలసి వచ్చింది. తెలుగు సినిమా రంగంలో పదకొండు సార్లు రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులను అందుకున్న ఏకైక గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చరిత్ర సృష్టించారు. ఆ మాటకొస్తే నంది అవార్డుల్లో ‘హ్యాట్రిక్’ సాధించిన ఏకైక పాటల రచయిత…