లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్ నిర్వహించిన దీపావళి రిసెప్షన్ మెనూలో అంశాలను చేర్చే ముందు సరైన సలహా తీసుకోకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నాన్ వెజ్ స్నాక్స్, మద్యాన్ని మెనూలో చేర్చడంపై బ్రిటిష్ హిందువులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల పండుగ ఆధ్యాత్మిక కోణంపై అవగాహన లేకపోవడాన్ని హిందూ సంస్థ ఇన్‌సైట్ యూకే ప్రశ్నించింది.
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ విచిత్రమైన పరిస్థితిని ఎదర్కొన్నారు. అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్ అయ్యారు. నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే కూడా రిషి సునాక్‌తో కాసేపు బయటే ఉన్నారు. అక్కడ ఉన్న మీడియా అంతా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌గా మారింది. రిషి సునాక్, డచ్ ప్రధాని మార్క్ రొట్టేను అధికార నివాసం వెలుపల స్వాగతిస్తూ, మీడియాకు ఫోటోగ్రాఫ్ ఇచ్చారు.