ఛత్తీస్ గడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం కలిగించారు. బాంరగడ్ తాలుకాలో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న రెండు జేసిబీ,9 ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు. దీనివల్ల రూ. కోటి వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దుర్గరాజ్ పీయస్ పరిధిలో 100 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గడ్చిరోలి ప్రాంతంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత కొంతకాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ బొగ్గు గనిలో పెను ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లోని 11 డీపీ వద్ద భారీగా చేరింది నీరు. దీంతో నీటిలో మునిగాయి 150 హెచ్ పి మోటార్లు. హుటాహుటిన సంఘటనా స్థలం నుంచి పైకి వచ్చారు కార్మికులు. దీంతో విద్యుద్ఘాతం నుంచి తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కో మోటారు రూ.50 లక్షల విలువ చేస్తాయని, సింగరేణికి రూ.1కోటి రూపాయల నష్టం…