అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్‌లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు ఇంటిపై, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగానే ఆస్తులు, నగదు లభించినట్టు తెలుస్తోంది.…