ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా…