Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. కొత్త సాంకేతికత మానవాళికి ముప్పుగా మారుతుందనే భయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే సమయంలో ఏఐ మోడళ్లు అదుపు తప్పి ప్రవర్తిస్తున్న దాఖలాలు నమోదుకావడం.. కలకలం రేపుతోంది. సాక్షాత్తూ ఏఐని అభివృద్ధి చేసిన కంపెనీలే.. వేగం కంటే నియంత్రణ ముఖ్యమని ప్రకటనలు చేయడం.. అందరికీ కలవరం కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో.. ఏఐపై ట్రంప్ నిర్వహించిన కీలక సమావేశం.. భవిష్యత్ సవాళ్లకు ఏ మేరకు పరిష్కారాలు చూపగలదనేది ఆసక్తికరంగా మారింది. ఏఐ మోడల్స్ అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోన్న సమయంలో.. కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్‌లో ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ అకార్డ్‌ను ఆవిష్కరించారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్, ఆంథ్రోపిక్ అధినేత డారియో అమోడెయి, ఓపెన్ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. దీంతో ఏఐని అదుపులో పెట్టే నైతిక బాధ్యతను అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్వచ్ఛందంగా తీసుకున్నట్లయింది. ఈ ఒప్పందం కింద టెక్ కంపెనీలు తమంతట తామే ఐటీ భద్రతను సమీక్షించుకుంటాయి.
ఏఐ వల్ల మానవాళికి ఎదురయ్యే ముప్పుపై కొత్త హెచ్చరికలు రావడంతో, ఈ టెక్నాలజీ ఎప్పుడైనా మనుషుల నియంత్రణ దాటి ప్రమాదకరంగా మారుతుందా అనే పాత చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా, ఏఐని తయారు చేస్తున్న కంపెనీలు ఇలాంటి ప్రమాదాలను అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకుంటున్నాయా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఏఐపై ఆందోళనలు పెరుగుతుండటం.. మరోవైపు ఏఐ మోడళ్ల అదుపుతప్పి ప్రవర్తించే తీరు కూడా దిగ్గజ కంపెనీలను స్వచ్ఛంద నియంత్రణ దిశగా నడిపించాయని చెప్పాలి. ఈ విషయంలోనూ అమెరికా చొరవ తీసుకుంది. కృత్రిమ మేధ రంగంపై కొత్తగా కఠినమైన సమాఖ్య నిబంధనలు తీసుకురావడం కంటే కంపెనీలే తమను తాము పర్యవేక్షించుకోవాలన్న వైఖరిని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న చట్టాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. అమెరికా సాంకేతిక రంగంలో చైనా కంటే ముందంజలో ఉండాలంటే అభివృద్ధిపై అధిక నియంత్రణలు విధించడం సరికాదన్నది ట్రంప్ వైఖరి. ఏఐ సాంకేతికత అభివృద్ధిని అమెరికా ప్రభుత్వం నియంత్రించదని, అడ్డుకోదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రంగాన్ని సూపర్ ఇంటెలిజెన్స్ అని పిలవాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ సమాచారం, సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ట్రంప్ America.gov సైట్‌ను ఆవిష్కరించారు. ఇది ఏఐ సాంకేతికతతో నడుస్తుంది. ఈ సైట్లో ఓ విభాగం యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. కొన్ని సమాధానాలు ట్రంప్ ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయి. ఓ ప్రశ్నకు.. ఎప్స్టీన్ పైళ్లలో ట్రంప్ పేరు ఉందని సమాధానం ఇచ్చింది. తర్వాత వెంటనే సైట్ తన సమాధానాలను సవరించుకుంది.
Also Read
- Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
- OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
- Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
- Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
కృత్రిమ మేధ భవిష్యత్తు ప్రమాదాలపై అధ్యయనం చేయడానికి అమెరికా, చైనాలు కలిసి పనిచేయాలనే ఆలోచనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. తమ సాంకేతిక నైపుణ్యాలను మరో దేశంతో పంచుకుంటే టెక్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కోల్పోతుందని ఆయన చెప్పారు. మరోవైపు అమెరికాతో ఆరు టెక్ దిగ్గజాలు కుదుర్చుకున్న కృత్రిమ మేధ భద్రతా ఒప్పందాన్ని ట్రంప్ విడుదల చేశారు. ఏఐ కట్టు తప్పుతున్న తరుణంలో గూగుల్, ఎన్విడియా, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్ఏఐ, మెటా సంస్థలు స్వచ్ఛందంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్‌ను ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
చట్టపరంగా కఠినమైన నిబంధనలు కాకుండా, టెక్ కంపెనీలు తమంతట తాముగా భద్రతా ప్రమాణాలు పాటించేలా ఒక నైతిక ఒప్పందంపై ఈ దిగ్గజాలు సంతకాలు చేశాయి. ఏఐ వ్యవస్థలు మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కంపెనీలే స్వయంగా పర్యవేక్షించుకోవాలని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఇది చట్టబద్ధమైనది కాకపోయినా, అమెరికా భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. టెక్ కంపెనీలు అమలు చేయాల్సిన భద్రతా మార్గదర్శకాలపై వైట్‌హౌస్ ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది. దీని ప్రకారం ప్రతి కంపెనీ నాలుగు అంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మొదటిది ఇంటర్నల్ కంట్రోల్. ఏఐ మోడల్స్ శిక్షణ దశలోనే సైబర్ సెక్యూరిటీ, బయోసెక్యూరిటీ ప్రమాదాలను నివారించేలా పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి. రెండోది స్పెషల్ టీమ్స్. భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఇంటర్నల్ టీమ్స్ పనిచేయాలి. మూడోది ఎక్స్టర్నల్ ఆడిట్. నిపుణులతో కూడిన స్వతంత్ర ఎక్స్టర్నల్ ఆడిటర్ల ద్వారా భద్రతా విధానాలపై స్వతంత్ర అంచనాలు వేయించాలి. చివరిగా బోర్డు పర్యవేక్షణ. డైరెక్టర్ల బోర్డు నుంచి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఈ ఆడిట్ నివేదికలను పరిశీలిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
అయితే టెక్ సంస్థలు అంగీకరించిన ఈ పత్రానికి ప్రస్తుతం చట్టబద్ధమైన అమలు బలం లేదు. అంటే నిబంధనలు పాటించకపోతే వెంటనే శిక్షించే విధానం ఇందులో లేదు. అయితే సైబర్ భద్రత, జీవ భద్రత, రసాయన సంబంధిత ప్రమాదాలు వంటి అంశాల్లో ప్రమాదాలను గుర్తించి నియంత్రించేందుకు సంస్థలు చర్యలు తీసుకోవాలని ఒప్పందం సూచిస్తోంది. భవిష్యత్తులో అవసరమైతే వీటిలో కొన్ని అంశాలను చట్టాలుగా మార్చే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత అభివృద్ధికి భారీ కంప్యూటింగ్ సామర్థ్యం అవసరం. ఇందుకోసం డేటా కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ట్రంప్ కోరుతున్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ రంగాన్ని పర్యవేక్షించేందుకు దాదాపు పది మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఆ కమిటీలో ఎవరుంటారు? దానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి? అన్న దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ రంగంలో వేగంగా అభివృద్ధి అవసరమని ట్రంప్ చెబుతున్నారు.
మరోవైపు కృత్రిమ మేధ మోడళ్లు కట్టుతప్పకుండా వాటిని నియంత్రించే సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్నొకదాన్ని దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా విడుదల చేసింది. దాని పేరు.. ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్పామ్. చాట్‌జీపీటీ, జెమెనై, క్లాడ్, గ్రోక్ వంటి ఏఐ ఏజెంట్లు ఇష్టానుసారంగా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల సర్వర్లలోకి చొరబడకుండా కేవలం తమకు అనుమతి ఉన్న పనులు మాత్రమే చేసే నియంత్రిత వాతావరణాన్ని ఈ ప్లాట్‌ఫామ్ సృష్టిస్తుందని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. అందులో భాగంగా ఈ ప్లాట్ఫామ్లో రెండు రక్షణ వలయాలుంటాయి. ఒకటి.. ఓపెన్‌షెల్. ఇది సీపీయూ, జీపీయూల స్థాయిలో పనిచేస్తుంది. అంటే.. ఏఐ మోడళ్లు మన వ్యక్తిగత పరికరాల్లో చేయకూడని పనులేవైనా చేస్తుంటే ఆపుతుంది. రెండోది సెంట్రీ. ఇది నెట్వర్క్ చిప్స్ స్థాయిలో పనిచేస్తుంది. అంటే.. ఏఐ మోడళ్లు మనం చెప్పే పనులు చేయడానికి హ్యాకింగ్‌కు పాల్పడే ప్రయత్నం చేస్తే నిరోధించే వ్యవస్థ. ఇలా రెండు దశల్లోనూ ఏఐని నియంత్రించగలిగితే అది పూర్తిగా మానవుల అదుపాజ్ఞల్లో ఉంటుందన్నది ఎన్విడియా ఆలోచన. ఇప్పటికే కృత్రిమ మేధ కారణంగా పిల్లలు ప్రాథమిక గణితాన్ని మర్చిపోతున్నారని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. హోంవర్క్‌ను త్వరగా పూర్తి చేయడానికి విద్యార్థులు ఏఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, దీనివల్ల సొంతంగా ఆలోచించే శక్తి తగ్గుతుందన్నారు. మొత్తం మీద అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు కొన్ని సందర్భాల్లో వాటికి నిర్దేశించిన పరిమితులను దాటి పనిచేసే అవకాశం ఉందన్న ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. సైబర్ దాడులు, జీవ భద్రత, రసాయన ప్రమాదాలు వంటి అంశాల్లో ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా ఇప్పుడు అభివృద్ధి వేగాన్ని పెంచడంతోపాటు భద్రతా నియంత్రణలను ఎలా బలోపేతం చేయాలి అన్న సవాల్‌ను ఎదుర్కొంటోంది.
- Tags
- AI
- Ntv Global
- story board
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?