ఫైనాన్సియల్ అలార్మింగ్ వచ్చేసింది. దేశంలో పరిస్థితులు క్లిష్టంగా మారిపోతున్నాయి. మహా సంక్షోభం నుంచి బయట పడాలంటే పొదుపు మంత్రాన్ని పాటించాల్సిందే. ఎవరికి వారు ఖర్చులను తగ్గించుకొని…పొదుపునకు ప్రాధాన్యత ఇస్తే మాంద్యం నుంచి బయట పడే అవకాశం ఉంది. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. మహా సంక్షోభం ముంచుకొస్తోంది. ఎవరేం చేసినా మాంద్యం నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. ప్రజలు అన్నిటికి సిద్ధమై ఉండాల్సిందే తప్పా…ప్రభుత్వాన్ని నిందించినా ఎలాంటి ఫలితం ఉండదు. గ్లోబలైజేషన్‌తో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా…అది అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
గ్లోబలైజేషన్‌తో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా…క్షణాల్లో తెలిసిపోతోంది. ఇండియా నుంచి ఇటలీ దాకా…అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు…ఏం జరిగినా…అది మిగిలిన దేశాలపై ప్రభావం చూపుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్దంలో అనేక దేశాలు విలవిల్లాడాయి. ఆ దేశాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా కావాల్సిన ఉత్పత్తులు ఆగిపోయాయి. ఆ తర్వాత అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వరుస బాంబ్ దాడులతో పెట్రోల్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు హర్మూజ్ జలసంధిని మూసివేతతో చమురు సప్లై చైన్ ఊహించని విధంగా దెబ్బతింది. ఆ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. అదే ప్రపంచ మహా మాంద్యానికి దారి తీసింది. ఈ మహా సంక్షోభం నుంచి ఎవరు తప్పించుకోలేరు. జాగ్రత్తలు తీసుకోవడం తప్పా…చేసేది ఏమీ ఉండదు.
మహా మాంద్యం కేంద్ర ప్రభుత్వం సృష్టించింది కాదు. ఆర్థిక మహా సంక్షోభం నుంచి బయట పడేసే తారకమంత్రం ఏదీ కేంద్రం వద్ద లేదు. దీన్ని కంట్రోల్ చేయడం ఎవరి చేతుల్లోనూ లేదు. దేశ ప్రజలు ఎవరికి వారు పొదుపు మంత్రాన్ని జపించాలి. అంతేకాని కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే వచ్చేది ఏమీ ఉండదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడమే మన ముందున్న కర్తవ్యం. ప్రజలు అన్నిటికి సిద్ధమై ఉండాలి. ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకోవాల్సిందే. మోడీ సర్కార్ చేయాల్సింది…చేస్తుంది. దేశ పౌరులుగా ఆ సూచనలు పాటించాలి. యుద్ధం కారణంగా చమురు సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. దాన్నుంచి బయట పడేందుకు పెట్రోల్ ధర 3 రూపాయలు పెంచాయి. భవిష్యత్‌లో ధరలను సమీక్షించి…మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎంత అన్నది మాత్రం ఊహించడం అంత ఈజీ కాదు.
అంతర్జాతీయ ఒత్తిళ్లు…వరుస యుద్ధాలను ఎవరు అడ్డుకోలేరు. గ్లోబలైజషన్‌తో ఏ చిన్న దేశంలో జరగరానిది జరిగినా…ప్రత్యక్షంగా, పరోక్షంగా అది భారత్‌తో పాటు అనేక దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లోనూ పొదుపు చేయాల్సిందే. ఎవరు దీన్ని నిరాకరించినా…దాన్నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ఫైనాన్షియల్ అలార్మింగ్ వచ్చేసింది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారతీయులు ఎవరికి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా మునిగిపోతున్నామని ప్రత్యేకంగా వచ్చి చెప్పరు. దాన్ని మనమే గుర్తించాలి. ముందుంది మహా సంక్షోభమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ….సూచనాప్రాయంగా హెచ్చరించాలి. దేశ ప్రధానిగా మోడీ చెప్పారు. దాన్ని పాటించాల్సిన అవశ్యకత, అవసరం మన మీదే ఉంది. ప్రధాని చెప్పినట్లు పొదుపు మంత్రాన్ని జపిస్తే…ఎవరి సహాయం లేకుండా మీకే మీరే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు. దేశం మాకేం చేసిందని కాకుండా…పౌరులుగా తాము ఏం చేశామనేది గుర్తించాలి.
అమెరికా-ఇరాన్ తెచ్చిన సంక్షోభం అంత ఇంత కాదు. అమెరికా అహంకారం…ఇజ్రాయెల్ దూకుడు…ప్రపంచాన్ని ఆర్థిక మహా మాంద్యంలోకి నెట్టేశాయి. దీన్నుంచి బయట పడలేక ప్రపంచ దేశాలు పడరాని పాట్లు పడుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఏవీ కొలిక్కి రావడం లేదు. ఆ యుద్ధం తాలూకు ప్రభావం కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 నెలలుగా అంతర్జాతీయంగా చమురు గురించే ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాహనాలకే కాదు…ఆర్థిక వ్యవస్థలకూ ఇంధనమే ఆధారం. అందుకే అంత కలవరం. దాదాపు ప్రతీ రంగం చమురుపై ఆధారపడడం ఇందుకు ప్రధాన కారణం. వాటన్నింటిపైనా ఇప్పుడు ఎఫెక్ట్ తప్పడం లేదు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ఉత్పతి గణనీయంగా పడిపోయింది. హర్మూజ్ జలసంధిలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో…అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మోత మొగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌పై ఒకేసారి 3 రూపాయలు పెరిగింది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న ఇంధన రేట్లకు తగ్గట్లు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచకపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు 14, డీజిల్‌పై 42 మేర నష్టం వస్తోంది. ప్రస్తుతం నెలకు 55,416 కోట్ల మేర అండర్ రికవరీలు ఉన్నాయి. ఈ నష్టాలను తగ్గించుకోవాలంటే…పెట్రోల్, డీజిల్ రేట్లను 20 శాతం మేర పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. కనీసం 10 పెంచితే 17 వేల కోట్ల మేర నష్టం భర్తీ అవుతుంది. అయిల్ కంపెనీలను నష్టాల నుంచి తేరుకోవడానికి అనుగుణంగా…చమురు ధరలు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరాయంగా కొనసాగుతోంది.
దేశీయంగా గత రెండు నెలలుగా, ప్రతి నెలా 37 లక్షల టన్నుల పెట్రోల్, 85 లక్షల టన్నుల డీజిల్ వినియోగం ఉంటోంది. దీంతో ఓఎంసీలపై భారం భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ కంపెనీలకు నెలకు 55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో లీటరుకు 2 చొప్పున పెంచితే నెలవారీ అండర్ రికవరీలు రూ. 52,105 కోట్లకు, 4 పెంచితే 48.794 కోట్లకు తగ్గుతాయని భావిస్తున్నారు. 10 పెంచితే ఓఎంసీలకు రూ. 17,000 కోట్ల భారం తగ్గుతుందని, ఆదాయ నష్టం సుమారు రూ. 38,863 కోట్లకు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.
దేశభక్తి అంటే…సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేయడమే కాదు…ప్రభుత్వ ఆదేశాలను పాటించినా దేశభక్తి అవుతుంది. శ్రీరాముడికి ఉడుత సాయం చేసినట్లే…దేశం కోసం ప్రజలు కూడా పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలంతా కలిసికట్టుగా సంకల్పం తీసుకుంటే…ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు ప్రధాని మోడీ సైతం అదే చెబుతున్నారు.
మహా మాంద్యాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే దాన్నుంచి బయట పడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. దేశ ప్రజలు ఎవరికి వారు…ప్రభుత్వం చెప్పిన ఆర్థిక సూత్రాలను పాటిస్తే…దేశానికి బాగు చేసిన వారు అవుతారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లోకి వెళ్లి యుద్ధమే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటిస్తామో…జాతీయ గీతాన్ని ఎలా ఆలపిస్తామో…అలాగే పొదుపునకు ప్రాధాన్యత ఇస్తే చాలు. అది కూడా దేశభక్తే. ఆణా..ఆదా చేస్తే రూపాయి అవుతుందని పెద్దలు అంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఇదే చెబుతున్నారు. మీ కోసం…మీ భవిష్యత్ కోసం జాగ్రత్తలు తీసుకోండని చెబుతున్నారు. దుబారా ఖర్చు చేసి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే దాని కంటే…మొదట్నుంచి దానికి పరిమితులు విధించుకుంటే దేశానికి మంచి చేసిన వారవుతారు. ప్రతి దానికి ప్రభుత్వం మీద ఆధారపడకూడదు. దేశ పౌరులుగా కొన్నింటిని కర్తవ్యంగా తీసుకోవాలి. ఎవరో వస్తారని…ఏదో చేస్తారని ఆలోచించద్దు. వ్యక్తుల కన్నా దేశమే గొప్పది. దేశం కోసం అందరూ పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది.
కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు…రోజు విడిచి రోజు ఆఫీసులకు వెళ్లారు. దాన్నే ఇప్పుడు ప్రభుత్వం ఫాలో అవమని చెబుతోంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడం వల్ల పెట్రోల్ వినియోగం తగ్గించింది. దీంతో ఉద్యోగులకు ఇంధన ఖర్చులు ఆదా అయ్యాయి. రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. కంపెనీలకు ఆఫీసుల నిర్వహణ ఖర్చు, అద్దె రూపంలో ఉన్న ఖర్చులతో పాటు విద్యుత్ బిల్లులు తగ్గాయి. అంతేకాదు వాతావరణ కాలుష్యం అదుపులోకి వచ్చింది. ప్రజలకు స్వచ్చమైన గాలి పీల్చుకునేందుకు అవకాశం దొరికింది. ఈ ఎఫెక్ట్‌తో నైరుతి రుతుపవనాలు సకాలం రావడంతో మంచి వర్షాలు కురిశాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. వీటి వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చు. దీనికోసం మనం చేసే చిన్న ప్రయత్నాలు కూడా దేశానికి ఎంతో ఉపయోగపడతాయి.
డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్‌పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. దేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్‌లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.
ఇటు బంగారం అవసరాలకు కూడా మనకు దిగుమతులే ఆధారం. 90% దేశీయ అవసరాలకు భారత్ దిగుమతులపైనే ఆధార పడుతోంది. దీనికి కూడా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. బంగారం ధరలు భారీగా పెరగడం సమస్యను మరింత పెంచుతోంది. దిగుమతుల బిల్లు పెరగడం వల్ల యావత్ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. రూపాయి విలువ క్రమంగా పతనం అవుతూ వస్తోంది. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్న కారణంగానే ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయకుండా సంక్షోభం నుంచి బయట పడవచ్చు. బంగారం కోసం భారత్ దిగుమతులపై ఎంతగా ఆధారపడుతుందో ఒకసారి లెక్కలు చూస్తే ఆశ్చర్యం కల్గుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24% పెరిగి ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. మొత్తం 71.98 బిలియన్ డాలర్లు అంటే రూ.6,65,815 కోట్ల విలువైన బంగారం దిగుమతి అయినట్లు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు రూ.5,33,600 కోట్ల డాలర్లు ఉండగా, 2023-24 ఏడాదిలో 4,14,000 కోట్లు, 2022-23లో 3,22,000 కోట్ల విలువైన బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది. అందుకే పుత్తడి కొనుగోళ్లు ఆపేస్తే విదేశీ మారక నిల్వలు తరిగిపోకుండా ఉంటాయి.
బంగారానికి డిమాండ్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేసినా అంతగా ఫలించలేదు. అధిక దిగుమతి సుంకాలు, దిగుమతులపై ఆంక్షలు, గోల్డ్ మానిటైజేషన్ పథకాల వంటి నిర్ణయాలను అమలు చేసింది. అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా బంగారాన్ని పెట్టుబడిగా చేసే కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపింది. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో కోట్లాది మంది భారతీయులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. బంగారం కొనుగోళ్లను ఆపమనడం ద్వారా అనవసర కొనుగోళ్లను తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే బంగారం దిగుమతులను తగ్గించాలని భావిస్తోంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి, బంగారానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అదే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం వస్తు ఉత్పత్తిపై పడుతుంది. ఒక వేళ కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పైగా రూపాయి విలువ తగ్గితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలన్నీ పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. అదే బంగారం కొనుగోళ్లు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి దిగుమతుల బిల్లు తగ్గించుకోవడానికి బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవడం మంచి ప్రత్యామ్నాయం. ఈ పరిస్థితుల్లో ప్రధాని సూచనను ప్రజలంతా పాటిస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే పరిణామమే. బంగారం లేకపోయినా బతకొచ్చు. అదే చమురు లేకపోతే పరిశ్రమలన్నీ మూతపడతాయి. ఆఖరికి ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదముంది.
యుద్ధం ముగిసినా…హర్మూజ్ తెరిచినా భారత్‌కు ఇప్పటికిపుడు కష్టాలు తీరవు. చిటికెడు పొదుపు…పిడికెడు ధన అన్న ఫార్మూలాను ప్రజలు అలవాటు చేసుకోవాలి. దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని…ఒక యుద్ధంలా భావించాలి. మహా మాంద్యం నుంచి బయట పడేయడానికి ఉన్న ఏకైక మార్గం పొదుపు మంత్రం.
జాతీయ జెండాను ఎగురవేయడం దేశభక్తిని ఎలా చాటుతుందో… విదేశీ మారకద్రవ్య సంరక్షణకు తోడ్పడటం కూడా దేశభక్తి కిందకే వస్తుంది. లాల్ బహదూర్ శాస్త్రి 1965లో ఆహారం విషయంలో…ఇదే తరహాలో పిలుపునిచ్చారు. దేశం యుద్ధాన్ని, ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో…సోమవారం సాయంత్రాలు స్వచ్ఛందంగా ఉపవాసం పాటించాలని దేశ ప్రజలను కోరారు. ఇప్పుడు కూడా దేశం మనకు ఎంతో ఇచ్చింది. సంక్షోభ సమయంలో దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రధాని చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. పొదుపుపై భారీస్థాయిలో ప్రచారం చేయాలి. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇళ్లకు, వ్యవసాయ పంప్‌సెట్లకు సౌరవిద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు చేసుకుంటే…విద్యుత్ ఆదా అవడంతో పాటు ఖర్చు తగ్గుతాయి. ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలి.
అమెరికా ఇరాన్ యుద్ధంతో 2 నెలలుగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు ప్రతీ రంగం చమురుపై ఆధారపడడంతో ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చమురు ధరలు పెరుగుతుండటంతో…నిత్యావసర సరుకుల ధరల పోటు ముందుంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇప్పటికే ఎఫ్ఎమ్సీజీ సంస్థలు ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఈ మధ్యే ధరలు పెంచాయి. ఇప్పుడిది కూడా చాలక మళ్లీ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పశ్చిమాసియా యుద్ధం త్వరలోనే ముగిసినా…బడ్జెట్‌ను తలకిందులు చేయనుంది. పొదుపు మంత్రాన్ని పాటిస్తే…ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడకపోయినా…కష్టాలు పడాల్సిన అవసరం ఉండదు. మీ ఇంటి బడ్జెట్ ఎంతైతే అంత ఆ మొత్తంలో కొంత అదనంగా పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు…నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం చూపనుంది.
రెండు నెలల పాటు హర్మూజ్‌ను క్లోజ్ చేశారు. ఇది ధరల పెరుగుదలతో పాటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆసియా దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. అంతేకాకుండా చమురు ఉత్పత్తి ఆగిపోవడంతో పాటు కీలకమైన ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందులు వచ్చాయి. ఆసియాలోని కొన్ని దేశాలు చమురు కొరతతో విలవిలలాడాయి. విమానయాన సంస్థలు…సర్వీసులను తగ్గించాయి. పరిశ్రమలు ఉత్పత్తులను వాయిదా వేశాయి. చమురు సరఫరా అనేక రంగాలపై ప్రభావం చూపింది. ఎరువులు, ఆహారం, ఇతర ముఖ్యమైన ఉత్పత్తులపై విపరీతమైన ప్రభావం చూపనుంది. ఇప్పటికిపుడు హార్మూజ్‌ను తెరిచినా సాధారణ పరిస్థితి వచ్చే అవకాశమే లేదు. ఈ సంక్షోభం తొందర ముగుస్తుందని ఎవరు అంచనా వేయలేరు. ఇదే విషయాన్ని సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ స్పష్టం చేశారు.
చమురు ధరల కారణంగా సామాన్యుల మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. అందుకే అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి. కుటుంబ బడ్జెట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిప్‌లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి
ముడి చమురు ధరలు పెరిగితే ఆ మేరకు వీటి తయారీ ఖర్చు పెరుగుతుంది. అనుగుణంగా ఆ ఉత్పత్తి ధరపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు జరుగుతోంది ఇదే. కొన్ని అంచనాల ప్రకారం ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ముడి సరుకుల ధరలు కనీసం 40-80% మేర పెరుగుతాయి. అలాంటప్పుడే సంస్థలు ఉత్పత్తుల వెయిట్ తగ్గించడమో లేదా ధరలు పెంచడమో లాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇప్పటికైతే పెట్రో సంస్థలు మాత్రమే ధరలు పెంచాయి. ఈ ధరల ఎఫెక్ట్ మిగిలిన రంగాల మీద పడటంతో…ధరలు పెంచాలనే యోచనలోనే ఉన్నాయి. ఎప్పుడో అప్పుడు అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశముంది. సరఫరా గొలుసులో ఇబ్బందులన్నీ తగ్గిపోయి మళ్లీ ముడి చమురు విరివిగా లభిస్తే తప్ప ఇప్పట్లో ధరలు మామూలు స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. అదంతా జరగాలంటే హార్మూజ్ జలసంధిలో మునుపటిలా రవాణా ఊపందుకోవాలి. అదే సమయంలో మన కరెన్సీ కూడా బలపడాలి. తద్వారా ఇన్‌పుట్ కాస్ట్ తగ్గుతుంది. తద్వారా తయారీ ఖర్చు తగ్గి..ధరలు తగ్గుతాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్న అంశాలు. ఇదంతా జరిగే వరకూ వినియోగదారులు ఆ భారాన్ని భరించక అయితే తప్పదు.
అయితే సేవింగ్స్ చేయాలనుకుంటే దానికి టైంతో పనిలేదు. వెంటనే మొదలు పెట్టాలి. టైం ఈజ్ మనీ అన్న ఫార్ములాని గుర్తు పెట్టుకోవాలి. అలా వెంటనే మొదలుపెట్టినప్పుడే అది అలవాటుగా మారుతుంది. ఈ రోజుల్లో వంద నోటు మారిస్తే చేతిలో రూపాయి కూడా చిల్లర మిగలదు. దీనికి కారణం ఖర్చుపై కంట్రోల్ లేకపోవడం. పొదుపు అంటే ఖర్చుపై అదుపు. అంటే ఖర్చులను అదుపులో ఉంచుకున్నప్పుడే అదుపు సాధ్యం. కనీసం సంపాదనలో 20 నుంచి 30 శాతం ఆదా చేసుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండదు. వయస్సుతో పాటే ఆస్తి కూడా పెరుగుతూ పోతుంది. ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా ఖర్చు పెట్టేది షాపింగ్‌కే ఆఫర్ల పేరుతో డిస్కౌంట్ సేల్స్ పెడితే అందరూ అట్రాక్ట్ అయ్యి షాపింగ్ చేస్తుంటారు. మినిమలిస్టిక్ పద్ధతిలో అవసరానికి తగ్గ వస్తువులు వాడుతూ…ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి. పొదువుని పెంచాలంటే ఒక సిస్టమేటిక్ బడ్జెట్ వేసుకోవడం చాలా అవసరం. ఆదాయాన్ని, ఖర్చులను బట్టి ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్ ఏంటో నిర్ణయించుకుని, ఒక సిప్లమాటిక్ బడ్జెట్ వేసుకోవాలి. పొదుపు చేసే ప్రతి రూపాయి అదనపు ఆదాయంగానే పరిగణించాలి. పొదుపు విషయంలో బకెట్ సిస్టంను పాటించాలి. బకెట్ సిస్టం అంటే ఒక బకెట్ నిండిన తర్వాత మరో బకెట్ నింపినట్లుగా డబ్బుని కూడా ప్రియారిటీస్ ప్రకారం పొదుపు చేసుకుంటూ వెళ్లాలి.
