Story Board: Gen Zతో రాబోయే కాలంలో రాజకీయ మార్పులు ఎలా ఉండబోతున్నాయి?
- జెన్‌జీ కేవలం సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్లడం లేదు..
- సరైన సమాధానాలు చెప్పేవరకూ వదిలి పెట్టడం లేదు..
- జెన్‌జీ తరం ముందున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం..
- ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారదర్శక నియామక వ్యవస్థలు..
- యువ ఓటర్లు ఎక్కువగా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు..
- ఒక్క వాట్సాప్ మెసేజ్, ఒక్క ఫేస్బుక్ పోస్ట్..
- దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశం..
- జెన్‌జీ అనే దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన కొత్త తరంగం..
- విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ఏకమయ్యారు..
- పార్టీలన్నీ విద్యార్థి విభాగాలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్‌జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంపై సర్వత్రా పొగడ్తల వర్షం కురుస్తోంది. హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా శాంతియుత మార్గంలో 36 రోజులపాటు విద్యార్థులు దీక్షను సాగించడం.. చివరకు మూడు ప్రధాన డిమాండ్లను సాధించడంపై అంతటా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతల సమస్య ఎదురవ్వలేదు. మహాత్ముడి అహింస మార్గంలోనే విద్యార్థి ఉద్యమం కొనసాగింది. 36 రోజులుగా దీక్ష కొనసాగినా.. ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో విద్యార్థి ఉద్యమానికి అంతటా మద్దతు లభించింది. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేస్తే, జాతీయ జెండాను నేలపై పడిపోకుండా పలువురు విద్యార్థులు పట్టుకొంటున్న వీడియోలు అందరిలో దేశభక్తిని రగిల్చాయి. ఇది ఉద్యమ తీవ్రతను మరింత పెంచాయి.
కొన్నేళ్లుగా యువత ఉద్యమాలకు దూరంగా ఉంటోంది. జెన్‌జీ పూర్తిగా కెరీర్ మీదే ఫోకస్ చేసింది. మొదటి నుంచి విద్యార్థి ఉద్యమం ఎంతో స్పష్టతతో నడిచింది. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు, ప్రాణాలు తీసుకొన్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలతో పాటు విద్యార్థులపై కేసుల ఎత్తివేత.. ఇవే మూడు ప్రధాన డిమాండ్లతో చివరి వరకూ విద్యార్థులు పోరాడటం సాగించడం అందర్నీ ఆకర్షించింది. ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో విద్యార్థులు సాంకేతికతను ఓ ఆయుధంగా మలుచుకొన్నారు. సోషల్‌మీడియా సాయంతో యావత్తూ దేశ ప్రజల మద్దతును కూడగట్టారు. ఏఐతో రూపొందించిన కొన్ని ఊహాజనిత వీడియోలతో ఉద్యమ తీవ్రతను పెంచారు. విద్యార్థుల ఉద్యమానికి యావత్తూ దేశ ప్రజానీకం బాసటగా నిలిచింది. జంతర్ మంతర్‌కు వేలాదిమంది ఫుడ్ ఆర్డర్లు పెట్టారు.
Also Read
- Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
- Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
- Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
- Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయవంతమైంది. జెన్‌జీకి నాయకత్వం వహించే నాయకత్వం లేదు. అభిజిత్ దీప్కే రూపంలో నాయకుడిగా దొరికినా…జెన్‌జీకి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లేదు. అభిజీత్ దీప్కేకు మాస్ అప్పీల్ లేదు. నీట్ ఉద్యమానికి కారణం ఉంది. బాధితులతో పాటు జెన్‌జీ వెల్లువలా జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు. ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. నీట్ ఉద్యమం అయిపోయింది. మరీ నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 36 రోజుల పాటు దేశ రాజధానిలో ఉద్యమం నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో…ఎవరికి వారు స్వతహాగా తరలివచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నారు.
36 రోజుల పాటు ఉద్యమం చేసిన జెన్‌జీ వెనుక ఎవరున్నారు ? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కేజ్రీవాల్ ఉన్నారని కొందరు ? కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ…సీజేపీ ఉద్యమాన్ని వెనుకుండి నడపించిందని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే జెన్‌జీ ఉద్యమం వెనుక ఎవరున్నా సరే…36 రోజుల మొక్కవోని దీక్షతో ఉద్యమం చేయడం మాములు విషయం కాదు. సీజేపీ జంతర్‌మంతర్ వద్ద నిరసనలు ప్రారంభించిన వెంటనే…కేంద్రం నిర్ణయం తీసుకుని ఉంటే ఆందోళనలు తారాస్థాయికి చేరి ఉండేవి కాదు. నెల రోజులకుపైగా జెన్‌జీ అంత పట్టుదలగా నిలబడటంతోనే…నీట్ ఉద్యమానికి హైప్ వచ్చింది. లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడినందునే…ఢిల్లీకి వేల మంది యువత తరలివచ్చింది. జెన్‌జీ ఉద్యమంతోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 96.88 కోట్లు. వీరిలో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు 22.78 శాతం, అంటే దాదాపు 22 కోట్ల మంది. ఇందులో 18-19 సంవత్సరాల మధ్య వయస్సుగల తొలి ఓటర్లు 1.85 కోట్లు, 20- 29 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్లు 19.74 కోట్లకుపైగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు మాత్రమే రెండు కోట్లకు పైగా కొత్త యువ ఓటర్లు ఓటరు జాబితాల్లో చేరారు. ఈ గణాంకాలు జెన్ జీ ఓటర్ల పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్లలో జెన్ జీ వాటా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు జెన్ జీకి చెందినవారే అయ్యే పరిస్థితి ఏర్పడనుంది. ప్రదాయంగా యువత పోలింగ్‌లో పెద్దఎత్తున పాల్గొనదనే అభిప్రాయం ఉండేది. అయితే జంతర్‌మంతర్ వాళ్ల చైతన్యాన్ని ప్రస్ఫుటం చేసింది. దేశంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం 67.4 కాగా, 2024లో అది 65.8 శాతానికి తగ్గింది. అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో యువ ఓటర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.
రాజకీయ పార్టీలు జెన్ జీ గురించి ఆలోచించాల్సిన స్థితిని కల్పించింది. నాణ్యమైన ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సులు, నైపుణ్యాధారిత బోధనను వారు కోరుకుంటున్నారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, మూల్యాంకనలో లోపాలు వంటి పరిణామాలు యువతలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. యువత ఆకాంక్షలను నిర్లక్ష్యం చేసే పార్టీలకు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదు. జెన్ జీ ఆధునిక భారతదేశాన్ని కోరుకుంటోంది. నాణ్యమైన ఉద్యోగాలు, అందుబాటులో ఉన్నత విద్య, స్వచ్ఛమైన పర్యావరణం, సమాన అవకాశాలు, పారదర్శక పాలన, సాంకేతిక పురోగతి…ఇవే వారి ప్రధాన ఆకాంక్షలు. యువతలో రాజకీయ చైతన్యం పెరిగింది. హక్కుల కోసం గొంతెత్తుతోంది. విద్యా సంస్కరణల కోసం తాము చేసే పోరాటంలో…ఇది ఆరంభం మాత్రమేనని జెన్‌జీ హెచ్చరిస్తోంది.
యువత అనుకుంటే ఏం చేయగలదో మరోసారి నిరూపితమైంది. విద్యార్థుల శక్తి ఎలాంటిదో దేశం కళ్లారా చూసింది. మనసులో అసంతృప్తి, ఆగ్రహం ఉన్నా.. పలు భయాలతో ఆందోళనకు వెనుకాడిన ఎన్నో వర్గాలకు.. ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థి విజయం కొత్త స్ఫూర్తి నిచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు యువ భారత్…స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది. జవాబుదారీతనం, రాజ్యాంగ విలువలతో కూడిన పాలనను నేటి తరం కోరుకుంటోంది. దేశంలోని జెన్‌జీ కేవలం సిద్ధాంతాలతోనే ముందుకు వెళ్లడం లేదు. అది ఆకాంక్షలతో నడుస్తోంది. ప్రతిభకు ప్రతిఫలం, సంస్థల విశ్వసనీయత, సమాన అవకాశాలు, రాజ్యాంగం కేవలం ప్రసంగాలలోనే కాకుండా పాలనలో గౌరవించే దేశాన్ని ఈ తరం కోరుకుంటోంది. గణతంత్ర భవిష్యత్తుపై వారికి ప్రగాఢమైన శ్రద్ధతో ప్రభుత్వాన్ని కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. కేవలం ప్రశ్నలు అడగటమే అజెండాగా పెట్టుకోవడం లేదు. దానికి సరైన సమాధానాలు చెప్పేవరకూ వదిలి పెట్టడం లేదు
ఉపాధి అవకాశాల కొరత, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలు యువత ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. జెన్‌జీ ఓటర్లు ఏ ఒక్క రాజకీయ పార్టీకి శాశ్వత మద్దతుదారులు కాదు. తమ జీవితాలను ప్రభావితం చేసే వాస్తవ సమస్యల ఆధారంగానే…రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జెన్‌జీ తరం ముందున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఉన్నత విద్య పూర్తి చేసినా, నైపుణ్యాలు సంపాదించినా నాణ్యమైన ఉద్యోగాలు దొరకక లక్షలాది మంది యువత నిరాశలో ఉన్నారు. వివిధ అధ్యయనాల ప్రకారం యువ నిరుద్యోగిత 15 నుంచి 25 శాతం మధ్య నమోదవుతోంది. అందుకే ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారదర్శక నియామక వ్యవస్థలు ఈ తరానికి అత్యంత ప్రాధాన్య అంశాలుగా మారాయి. విద్యా వ్యవస్థ కూడా యువత ఆందోళనల్లో కీలక స్థానం సంపాదించింది.
బలమైన ఆశలు, ఆకాంక్షలతో ఎలుగెత్తిన విద్యార్థులు.. తమ ఆలోచనలకు ఎంతటి బలం ఉంటుందో.. ఎంతటి శక్తివంతమైన కార్యాచరణ తీసుకోగలమో అనేది చేసి చూపించారు. మరీ ముఖ్యంగా ఏం చేసినా చెల్లిపోతుందనుకునే ప్రభుత్వాల వైఖరి మారి తీరాల్సిందేనని గట్టిగా చెప్పారు. నిన్నటి తరం ఆలోచనలతో, పాత చింతకాయ పచ్చడి విధానాలతో నడుస్తున్న పార్టీలకు ఎన్నికలలో నవతరం నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. యువతరంలో ఆశలు, ఆకాంక్షలు పెరుగుతున్న సమయంలోనే నిరాశా నిస్పృహలు కూడా వారిని కమ్మేస్తున్నాయి. అందుకే సంప్రదాయ రాజకీయ పార్టీలతో విసిగి వేసారిన జెన్‌జీ.. ప్రస్తుత నేతలతో లాభం లేదని ఓ నిర్ధారణకు వచ్చి.. కొత్త శక్తిగా రంగప్రవేశం చేస్తున్నారు.
యువ ఓటర్లు ఎక్కువగా ఎన్నికలను ప్రభావితం చేయవచ్చు. భవిష్యత్తులో భారత ప్రజాస్వామ్యంలో జెన్ జీ అత్యంత ప్రభావవంతమైన శక్తులలో ఒకటిగా మారవచ్చు. ప్రత్యేకించి సంప్రదాయ పార్టీలు నిరుద్యోగం, అవినీతి, వేగంగా మారుతున్న తరం ఆకాంక్షలను పరిష్కరించడంలో విఫలమైతే.. జెన్‌జీ తరహా రాజకీయం ముందుకొస్తుందనటానికి సందేహించాల్సిన పనేం లేదు. ఏతావాతా ఈ దేశ మౌలిక విలువలపై నిర్లక్ష్యం వహిస్తే.. తాము చూస్తూ ఊరుకునేది లేదని జెన్‌జీ గట్టిగా నినదిస్తోంది. సంప్రదాయ పార్టీలు దేశవ్యాప్త ఉద్యమాల కోసం నెలల తరబడి కసరత్తు చేస్తాయి. కానీ జెన్‌జీ మాత్రం అవన్నీ పాత పద్ధతులని తీసిపారేసింది. ఒక్క వాట్సాప్ మెసేజ్, ఒక్క ఫేస్బుక్ పోస్ట్‌తోనే వేలు, లక్షలు, కోట్ల మందిని కదిలిస్తోంది. జెన్‌జీ ఉద్యమం సందర్భంగా.. దేశప్రజలు రాజీలేని వైఖరి చేశారు. తాము మొదట్నుంచీ ఏం అడుగుతున్నామో.. అది చేసేదాకా వెనక్కితగ్గేది లేదని విద్యార్థులు నిరూపించారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే…విద్యార్థులు ఢిల్లీకి వచ్చారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్ఈ, సీయూఈటీ-యూజీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆందోళన చేశారు. ఈ నిరసనల ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు వస్తాయని ఆశిస్తున్నారు.
మన దేశం ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సాక్ష్యమిస్తోంది. అ శక్తి ఒక రాజకీయ పార్టీ కాదు.. జెన్‌జీ అనే దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన కొత్త తరంగం. పరీక్షలలో అవకతవకలు, నిరుద్యోగం, కొరవడిన పారదర్శకత, జవాబుదారీతనం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ఏకమై ధ్వజమెత్తారు. ఇది కేవలం ఒకే ఒక్క సంఘటనపై కలిగిన ఆగ్రహానికి మించి మరింత లోతైన విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అన్యాయం జరిగిందని భావించినప్పుడు మౌనంగా ఉండటానికి ఇష్టపడని ఒక తరం ఆవిర్భావానికి ఇది సంకేతం. నేటి విద్యార్థులు విజ్ఞానవంతులు, ధైర్యవంతులు. వారు పాలనలో నాణ్యత, ప్రభుత్వ విద్య భవిష్యత్తు, తమకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి సమంజసమైన ప్రశ్నలను సూటిగా అడుగుతున్నారు. అంతేకాదు ఫక్తు రాజకీయ పోరాటాల మాదిరిగా కొన్ని రోజులు హడావుడి చేసి ఊరుకునే రకం తాము కాదని, పట్టు పడితే.. చివరివరకూ నిలబడి తాడో పేడో తేల్చుకుంటామని జెన్‌జీ సగర్వంగా చాటుతోంది.
స్వాతంత్రోద్యమ కాలం నుంచీ కాలానుగుణంగా యువత కదం తొక్కుతూనే ఉంది. తిరుగులేని పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుకున్నది సాధించుకుంటూ వస్తోంది. కాకపోతే ప్రైవేటీకరణ తర్వాత కెరీర్‌పై ఫోకస్ పెట్టి.. ఉద్యమాలకు కాస్త విరామం ఇచ్చింది. దీంతో సంప్రదాయ పార్టీలన్నీ విద్యార్థి విభాగాలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అందుకే కొన్నాళ్లుగా ఎన్నికల మ్యానిఫెస్టోల్లోనూ యువతకు సంబంధించిన అంశాలు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. వాటి అమలు గురించి నిలదీసేవారు లేకపోవడం లోటుగానే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో నీట్ లీకేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసన.. అన్ని పార్టీల్నీ అప్రమత్తం చేసింది. యువతలో ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉందని.. పోరాటాలకు గ్యాప్ వచ్చిందే కానీ.. పోరాటం చేసే స్వభావంలో ఎలాంటి తేడా లేదని రుజువు చేసింది. అంతేకాదు దేశంలో ఇకపై రాజకీయం ఎలా నడవాలో తామే నిర్దేశిస్తామన్న సంకేతాలు కూడా ఇచ్చింది.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!