NTV Telugu Site icon

Jana Sena: వారాహి ఆగదు.. పవన్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

Pawan Varahi

Pawan Varahi

జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో వెళ్లనున్నారు. అయితే, సభ నేపథ్యంలో రహదారులపై ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ విజ్ఞప్తి మేరకు వారాహి యాత్రలో మార్పలుచేశారు. ముందు అనుకున్న ప్రకారం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించడం లేదు. శాసనస వచ్చే మంత్రులు, శాసనసభ్యులు, ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వారాహి యాత్ర ప్రారంభం అయ్యే స్థలాన్ని విజయవాడ ఆటోనగర్ కు మారుస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Also Read:Bengal Assembly: కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానం.. బెంగాల్ అసెంబ్లీ ఆమోదం

మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు కళ్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నం సభాస్థతికి బయలుదేరు ముందుగా ఎంపిక చేసిన అయిదు ప్రాంతాల్లో శ్రీ వివన్ కళ్యాణ్ కి స్వాగతం పలికిందుకు అన సైనికులు సిద్ధం ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ క్రమశిక్షణ పాటించాలని నాదెండ్ల సూచించారు. వారాహి వాహనానికి ఏమాత్రం అడ్డు రాకుండా ఎంతో జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ ని జనసైనికులు తీసుకు వచ్చేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. పోలీసు వినతిని పరిగణనలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చట్టాన్ని, చట్టాన్ని రక్షించే వారిని పూర్తిగా గౌరవించుకోవడం జనసేన పార్టీ మొదటి నుం పాటిస్తుందన్నారు. యాత్ర మార్పు స్థలాన్ని అనసైనికులు, వీర మహిళలు గమనించాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

Also Read:108 Ambulance: ప్రాణాలు కాపాడే వాహనానికే ఆపద!

ఈ రోజు మధ్యాహ్నం విజయవాడ ఆటోనగర్ నుండి వారాహిలో మచిలీపట్నం వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. సభా స్థలంలో 1,20,000 మంది కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సభకు హజరయ్యే జనసైనికులకు మజ్జిగ, మంచినీరు, స్నాక్స్ ఆహారం అందించే విధంగా 2 వేల మందితో వాలంటీర్ లు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ పరిధి వరకు పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని వీక్షించేలా 14 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు కలిగిన LED స్క్రీన్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.