NTV Telugu Site icon

Story Board: ట్రంప్‌ అధ్యక్షుడైతే అంతేనా..? విద్యార్థులు సర్దుకోవాల్సిందేనా..?

Donald Trump

Donald Trump

Story Board: అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్.. విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదట్నుంచీ వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడయ్యారు. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అంచనాలు భయపెడుతున్నాయి. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో ఉన్న తరుణంలో.. వీరందరి భవిష్యత్తుపై ట్రంప్ కత్తి వేలాడుతోంది. ఏం తేడా వస్తుందో.. ఎప్పుడు అమెరికా దాటాల్సి వస్తుందోనని భారత్ విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నారు. విదేశీ విద్యార్థులతో పాటు వీరు ఎక్కువగా ఉన్న వర్సిటీలు కూడా కంగారు పడుతున్నాయి. ట్రంప్ విధానాలు తమ విద్యార్థుల్ని ఎలా దెబ్బతీస్తాయోనని హడలిపోతున్నాయి. వీలైనంత వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ట్రంప్ విధానాలు ఎలా ఉండొచ్చో ఊహించి.. కొన్ని వర్సిటీలు తమ విదేశీ విద్యార్థుల్ని తయారు చేస్తున్నాయి.

ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కగానే వలసదారులపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టాలు, పాలసీలు తీసుకువస్తారనే అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అందుకే యూనివర్సిటీ నుంచి సెలవుల పై తమ స్వదేశం, లేదా ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థులు జనవరి 20 కి ముందే అమెరికా చేకోరువాలని కోరుతున్నాయి. అలా చేయని పక్షంలో అమెరికాలో వా రికి వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. యేల్ యూనివర్సిటీలో అయితే అమెరికాలో కొత్త వలస చట్టాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలపై వెబినార్ కార్యక్రమం నిర్వహించారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలు, ఉత్తర కొరియా, వెనెజులా లాంటి దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించారు. ఆ తరువాత విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించారు. ఈసారి ఆ దేశం ఈ దేశం అని లేకుండా విదేశీ విద్యార్థులందరికీ ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు, వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ముఖ్యంగా అక్రమ వలసదారులు, సరైన అనుమతి పత్రాలు లేని వారిని వారి దేశాలకు తిరిగిపంపిచేస్తామని అవసరమైతే జైళ్లలో, డిటెన్షన్ సెంటర్లలో పెడతామని.. అవి సరిపోకపోతే డిటెన్షన్ సెంటర్లు సరిపోక పోతే పెద్ద డిటెన్షన్ సెంటర్లు, కౌంటీ జైళ్లు ఉపయోగిస్తామని అన్నారు. అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టడానికి మిలిటరీ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా.. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రొగ్రామ్ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం.. విదేశాల నుంచి చిన్నతనంలో అమెరికా వచ్చి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులుకు వలసల చట్టం నుంచి ఉపశమనం లభించింది. ఇప్పుడు ఒబామా తీసుకువచ్చిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే భారత, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.

అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు వీసా నిబంధలపై అనుమానాలు ఉన్నాయి. అందుకే చాలామంది ఇండియా వచ్చారు. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కకముందే తిరిగి అమెరికా రావాలని ఆయా విశ్వవిధ్యాలయాలు విద్యార్థులకు సూచించాయి. 2023, 24లో భారత్ నుంచి చైనా కంటే ఎక్కువ మంది విద్యార్థులు విదేశాల్లో విద్య కోసం వెళ్లారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్‌పై ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం.. 3లక్షల 31వేల 602 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యాసంస్థలలో జాయిన్ అయ్యారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం పెరిగింది. ట్రంప్ ప్రధాన హామీల్లో ఒకటైన ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రస్తుతం భారతీయులకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. వారి పిల్లలు సహజంగా అమెరికా పౌరులుగా మారడంపై అనిశ్చితి నెలకొంది. సహజసిద్ధమైన పౌరుడు అంటే ఆ దేశంలో జన్మించిన కారణంగా అమెరికా పౌరసత్వం మారే ఒక ప్రక్రియ. అలాంటి వ్యక్తి తమ జాతికి చెందిన దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటే, వారు తమ జీవిత కాలంలో ఎప్పుడైనా పుట్టిన దేశమైన అమెరికా పౌరసత్వాన్ని ఎంచుకోవచ్చు. ట్రంప్ సహజసిద్ధమైన పౌరసత్వాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే అవకాశం ఉంది.

ఈ ఉత్తర్వు ప్రకారం.. పిల్లాడు అమెరికా పౌరసత్వం పొందాలంటే కనీసం తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా అమెరికన్ అయి ఉండాలి లేదా చట్టబద్ధమైన పర్మినెంట్ రెసిడెన్స్ అయి ఉండాలి. దీని అర్థం ఏంటంటే, అమెరికాలో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక్కరూ కూడా అమెరికన్ సిటిజన్ లేదా పర్మినెంట్ రెసిడెంట్ కాకుంటే వారికి పౌరసత్వం లభించదు. 2022 US జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం, USను తమ నివాసంగా మార్చుకుని 4.8 మిలియన్ల భారతీయ-అమెరికన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 1.6 మిలియన్ల భారతీయ-అమెరికన్లు అమెరికాలో పుట్టి పెరిగారు, వారిని సహజ పౌరులుగా మారారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టులు ఏం తేల్చుతాయనే సంగతి తర్వాత.. ముందు ట్రంప్ తమ కొంప ముంచుతారేమోనని భారత్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ట్రంప్ రాకముందే ఈ స్థాయిలో భయపడుతున్న విదేశీ విద్యార్థులు.. ఆయన అధికారం చేపట్టాక జరగబోయే పరిణామాలకు ముందే సిద్ధపడుతున్నారు. కొందరు మాత్రమే ప్రత్యామ్నాయాలు చూసుకోగలుగుతున్నారు. కానీ చాలా మందికి తమ కలలన్నీ కల్లలౌతాయనే దిగులు తప్పటం లేదు. ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన వారు, కష్టపడి డిగ్రీలు పూర్తిచేసిన వారు, ఇప్పటికే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్నవారు, ఒక్క మాటలో చెప్పాలంటే హెచ్ వన్ బీ వీసాపై ఉన్నవారందరి మెడపై ట్రంప్ కత్తి వేలాడుతున్నట్టే.

https://www.youtube.com/watch?v=iGZSv344E2g

Show comments