Storyboard: భక్తి టీవీ.. దేశంలోనే రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్స్‌ను వెనక్కి నెట్టి.. ఏకంగా నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఆరు జీఆర్పీలను సాధించి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ఛానెల్స్ ఉన్నా.. ఏదీ భక్తి టీవీ దరిదాపుల్లోకి రాలేకపోయాయి. హిందూ ధర్మ పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తోంది.
Read Also: Champavathi River: విజయనగరం జిల్లా జీవనాడిగా చంపావతి నది
భక్తి టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించి.. దేశాన్ని శాసిస్తోంది. ఆధ్యాత్మిక ఛానెల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో మరే ఆధ్మాత్మిక ఛానెల్‌కు సాధ్యం కాని రికార్డులను తన పేరిట లిఖించుకుంది. హిందువుల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. హిందూ పండుగలైనా…బ్రహ్మోత్సవాలైనా…ప్రముఖ ఆలయాల విశిష్టతలైనా…హిందూ ధర్మం కోసం భక్తి టీవీ కృషి చేస్తోంది. దేశం నలుమూలల్లో హిందూ ఆలయాల విశిష్టత, చరిత్ర భక్తులకు అందించడంతో భక్తి టీవీతో ఏ ఆధ్యాత్మిక ఛానెల్ పోటీ పడలేవు.
Read Also: Mohammed Azharuddin: రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం.. ఏ శాఖ కేటాయిస్తారు..?
హిందూధర్మ పరిరక్షణే లక్ష్యంగా భక్తి టీవీ ప్రసారాలు చేస్తోంది. భారతీయ ఆధ్యాత్మిక ప్రచారమే ధ్యేయంగా…మరే మతానికి కొమ్ముకాయని తత్వంతో దూసుకెళ్తోంది. ఇంటింట హైందవ చింతనే భక్తిTV మార్గంగా కృషి చేస్తోంది. కోటి దీపోత్సవంతో ప్రతిచోట కార్తీక దీపాలు వెలిగించేలా…హిందువుల్లో భక్తి భావాన్ని పెంపొందించి…రేపటి తరానికి ఆధ్యాత్మిక వారధిగా పయనిస్తోంది. అందుకే భక్తి టీవీ నెంబర్-1 ఆధ్యాత్మిక ఛానల్‌గా నిలిచింది.
Read Also: Amitabh Bachchan: దిల్జీత్ నమస్కారం – సిక్కుల ఆగ్రహం.. అమితాబ్‌పై కొత్త వివాదం
దేశ వ్యాప్తంగా భక్తికి విపరీతమైన నెట్ వర్క్ ఉంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు…కేవలం హిందువులు, హిందుత్వం ఎజెండాతో పని చేస్తున్న ఏకైక ఛానెల్ భక్తి టీవీ. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు…భక్తి టీవీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. మరే ఛానెల్‌కు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. హిందువులంతా…భక్తి టీవీని తమ సొంత ఛానెల్‌లా ఓన్ చేసుకున్నారు. అందుకే దేశంలోనే నెంబర్-1 ఆధ్యాత్మిక ఛానల్‌గా నిలిచింది. బార్క్ ఇవాళ విడుదల చేసిన రేటింగ్స్‌లో భక్తి టీవీ సర్వోన్నత స్థానంలో నిలిచింది. బార్క్ ఇవాళ విడుదల చేసిన రేటింగ్స్‌లో భక్తి టీవీ…నెంబర్-1 స్థానంలో నిలిచింది. సంస్కార్ టీవీ రెండో స్థానంలో, సిద్దార్థ్ ఉత్సవ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో దివ్య, ఆస్త, SVBC నిలిచాయి.
దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక ఛానెల్స్ ఉన్నప్పటికీ…భక్తి టీవీ మాత్రమే ఆరు జీఆర్పీలు సాధించి రికార్డు సృష్టించింది. సంస్కార్, సిద్ధార్థ్ ఉత్సవ్ టీవీలు నాలుగు జీఆర్పీలు చొప్పున సాధించి…రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈటీవీ లైఫ్ మూడు జీఆర్పీలు, దివ్య టీవీ రెండు జీఆర్పీలు, ఆస్తా రెండు జీఆర్పీలు, ఎస్వీబీసీ ఒక జీఆర్పీ చొప్పున సాధించాయి.
ఇండియా అర్బన్ కేటగిరిలో కూడా భక్తి టీవీ అగ్రస్థానంలో ఉంది. 8 జీఆర్పీ పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ కేటగిరిలో సంస్కార్, దివ్య, సిద్ధార్ధ ఉత్సవ్ వంటి చానళ్లు భక్తి టీవీ తర్వాతే ఉన్నాయి. ఇండియా అర్బన్‌లో భక్తి టీవీకి 8 జీఆర్పీలతో టాప్ లేపింది.. సంస్కార్ టీవీకి 5, దివ్య టీవీకి 4 జీఆర్పీలతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఈటీవీ లైఫ్‌కి మూడు, ఆస్తా, సిద్ధార్థ ఉత్సవ్‌కు రెండు జీర్పీలు చొప్పున వచ్చాయి. ఎస్వీబీసీ ఒక జీర్పీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో నంబర్‌వన్, తెలంగాణలో నంబర్‌వన్, తమిళనాడులో నంబర్‌వన్, కర్ణాటకలో నంబర్‌వన్…హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నంబర్‌వన్‌గా నిలిచింది భక్తి టీవీ. హిందూ ఆధ్యాత్మికతలో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంది. హిందుత్వం అంటే భక్తి టీవీ…భక్తి టీవీ అంటే హిందుత్వం అనేలా ప్రజల్లో గుర్తింపు సంపాదించుకుంది. హిందు ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా పని చేస్తోంది. హిందూ ధర్మం అన్నది అతి పురాతన సంస్కృతి…దీన్నే సనాతన ధర్మం అని అంటారు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడటంతో భక్తి టీవీ ముందు వరుసలో ఉంది.
దేశంలో హిందీ మాట్లాడే 80 కోట్ల మంది కోసం సంస్కార్, ఆస్తా టీవీ వంటి ఆధ్యాత్మిక ఛానెల్స్ ఉన్నాయి. అయితే 8 కోట్లు మాట్లాడే తెలుగు ఛానెల్ అయినా భక్తి టీవీ…నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకుంది. 80 కోట్ల మంది హిందీ మాట్లాడే వారు ఉన్నప్పటికీ…సంస్కార్, ఆస్తా ఛానెల్స్‌ను ఆరు కోట్ల మంది కూడా చూడటం లేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీరంతా భక్తి టీవీని మాత్రమే చూస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు…కర్ణాటక, తమిళనాడు. ఒడిషాల్లోనూ భక్తి టీవీని ఆదరిస్తున్నారు.
భక్తి టీవీ…కేవలం హిందువుల ఆధ్యాత్మక కార్యక్రమాలనే ప్రసారం చేస్తోంది. హిందుత్వమే ఏకైక జెండా, ఏజెండా. భక్తి టీవీలో అన్యమత ప్రచారం ఉండదు. ఏ మతానికి…ఏనాడు వంత పాడలేదు. భవిష్యత్‌లో పాడదు కూడా. హిందువులు, హిందుత్వం కోసమే అహర్నిశలు పాటుపడుతూనే ఉంది. భక్తి టీవీలో హిందుత్వం తప్పా…మరే మతానికి తావులేదు. లౌకికవాదం అన్న పేరుతో అన్ని మతాలకు వంతపాడదు. ప్రాతినిధ్యం వహించదు. నిరంతరం హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా పని చేస్తోంది. ఛానెల్ ప్రారంభోత్సవం నాడు…ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి ఏం చెప్పారో…ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు.
భక్తి టీవీ…ఏ మతానికి వ్యతిరేకం కాదు..అలా అని ఆ యా మతాలకు అనుకూలంగా పని చేయదు. ధర్మం వేరు…మతం వేరు. ఈ సిద్ధాంతంతోనే భక్తి టీవీ ఆధ్యాత్మిక ప్రసారాలు చేస్తోంది. వందల కోట్లు ఇతర మతాలు ఆఫర్ చేసినా….యాజమాన్యానికి అవసరం లేదు. హిందుత్వం కోసం…హిందూ ధర్మం కోసం భక్తి టీవీ ఆవిర్భవించింది. ఛానెల్ ప్రారంభమైనప్పటికీ నుంచి ఆధ్యాత్మిక ప్రసారాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది.
