BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zaheer Khan BCCI Chief Selector: భారత క్రికెట్లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగిస్తారా? లేదా కొత్త వ్యక్తిని నియమిస్తారా? అనే చర్చ నెట్టింట జోరుగా కొనసాగుతోంది. అగార్కర్ భవిష్యత్తుపై శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ పేరు కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం అజిత్ అగార్కర్ పదవీకాలం మరో ఏడాది పొడిగించే అవకాశం ఉందనే వార్తలు ఒకవైపు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయనను కొనసాగించకపోతే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని న్యూస్ చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్‌కు తొలి ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఆయన ఆసక్తి చూపకపోతే జహీర్ ఖాన్నే తర్వాతి ప్రధాన అభ్యర్థిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు అధిపతిగా లక్ష్మణ్ పనిచేస్తున్నారు. భారత క్రికెట్ వ్యవస్థలో ఆయనకు ఉన్న అనుభవం, యువ ఆటగాళ్లతో పనిచేసిన నేపథ్యం కారణంగా చీఫ్ సెలెక్టర్ పదవికి ఆయన పేరు బలంగా వినిపిస్తోంది.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
అయితే చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా, విదేశాల్లో జరిగే మ్యాచ్‌లు, సిరీస్‌లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ తరహా విస్తృత ప్రయాణాలతో కూడిన బాధ్యతలను స్వీకరించేందుకు లక్ష్మణ్ ఆసక్తి చూపకపోవచ్చని సమాచారం. అదే జరిగితే జహీర్ ఖాన్‌కు అవకాశాలు మరింత బలపడుతాయి. జహీర్ భారత క్రికెట్లో అత్యంత అనుభవజ్ఞుడైన మాజీ పేసర్లలో ఒకడు. భారత జట్టు తరఫున ఎన్నో కీలక మ్యాచ్‌లు ఆడిన అతడికి బౌలింగ్ విభాగంపై మంచి అవగాహన ఉంది. భవిష్యత్ జట్టు నిర్మాణం, ఆటగాళ్ల ఎంపిక, పేస్ బౌలింగ్ వనరుల అభివృద్ధిలో జహీర్ అనుభవం బీసీసీఐకి ఉపయోగపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగించకపోతే.. జహీర్ ఖాన్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తాజా నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సమర్థంగా నడుపుతున్న లక్ష్మణ్‌కు ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ వంటి కొత్త పదవిని సృష్టించి అప్పగించే ఆలోచన బోర్డులో ఉందని తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ అగార్కర్ భవిష్యత్తుపైనే ఆధారపడి ఉన్నాయి. సెప్టెంబర్‌లో అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నాడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం మరో ఏడాది పొడిగింపుకు అర్హత ఉంటుంది. బీసీసీఐ ఆయనను కొనసాగిస్తుందా? లేక కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమిస్తుందా? అనేది శ్రీలంక సిరీస్ తర్వాత జరిగే సమావేశంలో తేలే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!