Team india Cricketers: నేషనల్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తుంటే విదేశీ క్రికెటర్లతో మ్యాచులు ఆడాలి.. అలాంటప్పుడు బ్యాటర్‌ను ఔట్ చేసిన ఆనందంలో కాస్త అగ్రెసివ్‌గా సంబరాలు చేసుకున్నా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోరు. అయితే, ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ క్రమశిక్షణ కమిటీ నిత్యం అప్రమత్తంగా ఉంటుంది.. ‘ఓవర్’గా అనిపిస్తే దానికి తగినట్టుగా ‘శిక్ష’ను విధిస్తుంది. ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అంటే పెద్దగా పరిచయం అవసరం ఉండదు.. అదే దేశవాళీ లీగులకు వచ్చే సరికి.. ప్లేయర్స్ అందరు మళ్లీ కలిసి ఆడాల్సిన వస్తుంది. అయినా సరే, తమ షార్ట్ టెంపర్‌ను మాత్రం అదుపులో పెట్టుకోకపోతున్నారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ లీగ్స్ లోనూ కొందరు ఆటగాళ్లు ఇలాంటి వివాదాలకు కేరాఫ్ అడ్రాస్ గా నిలుస్తున్నారు.
Read Also: Tollywood Bundh : 10వ రోజుకు చేరుకున్న టాలీవుడ్ బంద్.. ఈ రోజు సమ్మె విరమణకు ఛాన్స్
హర్షిత్ రాణా ఓవరాక్షన్..
టీమిండియా జాతీయ జట్టుకు ఇటీవలే ఎంపికైన యువ పేసర్ హర్షిత్ రాణా దేశవాళీ క్రికెట్‌లో చాలా దూకుడు కనిపిస్తాడు. ఐపీఎల్‌లోనూ అతడి సంబరాలు చూశాం.. 2024 ఎడిషన్‌లో హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ ఇలాంటిదే చేసి ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఓ బ్యాటర్‌ను ఔట్ చేసిన తర్వాత అత్యుత్సాహం ప్రదర్శించి ‘జరిమానా’ పడేలా చేసుకున్నాడు. ఆర్టికల్ 2.5 లెవల్ 1 నేరం కింద అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధించారు. వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు బ్యాటర్ ఆయుష్ డొసేజాను క్లీన్‌బౌల్డ్ చేయగా.. స్టంప్ విరిగిపోయింది.. దీంతో రాణా సదరు బ్యాటర్‌ను ‘వెళ్లిపో’ అంటూ చేయితో సైగలు చేశాడు. దీంతో హర్షిత్ ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also: DRDO Manager Arrested: పాక్ కు గూఢచర్యం.. డీఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్టు
దిగ్వేశ్ రాఠీ అత్యుత్సాహం..
ఐపీఎల్‌లో లక్నో ప్లేయర్ దిగ్వేశ్ రాఠీ ‘నోట్‌బుక్’ సంబరాలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు.. అవే అతడిని హైలైట్ చేశాయి. ప్రత్యర్థి బ్యాటర్‌ను ఔట్ చేసిన తర్వాత ఏదో సంతకం చేసినట్లుగా సెలబ్రేట్ చేసుకునేవాడు. దీంతో ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నుంచి ఎన్నిసార్లు వార్నింగ్ వచ్చినా లైట్ తీసుకున్నాడు. ప్రవర్తనా నియమావళిని పదే పదే ఉల్లంఘించడంతో ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. కానీ, అతడి తీరు మాత్రం మారలేదు.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను అవుట్ చేసినప్పుడు కూడా ఇలానే వ్యవహరించడంతో.. వెస్ట్ దిల్లీ లయన్స్ ప్లేయర్ అంకిత్ కుమార్‌తో గొడవకు కూడా దిగాడు. అతడి బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టడమే దానికి కారణం.
Read Also: Janhvikapoor : పరమ్ సుందరి.. జాన్వీ పాపకి హిట్ ఇస్తుందా
ఆకాశ్ దీప్‌పై మాజీలు ఫైర్..
ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్ గా మహ్మద్ సిరాజ్ నిలిచాడు. అతడు కూడా తనదైన స్టైల్ లో అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ, ప్రత్యర్థిని అవమానించేలా ప్రవర్తించడం పెద్దగా కనిపించదు.. అయితే, ఇదే సిరీస్‌లో భారత పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెన్ డకెట్‌ను ఔట్ చేసినప్పుడు అతడి భుజంపై చేయి వేసి ఆకాశ్ మాట్లాడటం.. అది పాజిటివ్‌గా ఉన్నా సరే.. బ్యాటర్ స్టేడియం బయటకు వెళ్తున్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదనేది కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Mahabubabad: బాత్రూమ్ క్లీనర్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం..
అయితే, యువ క్రికెటర్లు దేశవాళీ లీగుల్లోనే ఇలా ప్రవర్తిస్తే.. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ స్థాయికి వచ్చాక కూడా ఇలానే వ్యవహరిస్తే.. అక్కడ ఐసీసీ చర్యల నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరని పేర్కొంటున్నారు. ఒక్క మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నా.. మళ్లీ జాతీయ జట్టులోకి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక, టీమిండియాలో చోటు కోసం పోటీ ఏ స్థాయిలో ఉంటుందో యువ క్రికెటర్లు అందరికి తెలిసిందే.. కాబట్టి, సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు.. కానీ, ప్రత్యర్థి బ్యాటర్‌ను అవమానించే చేయొద్దని సూచిస్తున్నారు.
