అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ఈ టోర్నీలో బదులు తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో మెహరూబ్ (30) టాప్‌స్కోరర్. భారత బౌలర్లలో రవికుమార్ మూడు, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు పడగొట్టారు.
Read Also: టీమిండియా క్రికెటర్లకు షాక్.. ఈసారి ప్రత్యేక విమానాల్లేవ్..!!
118 పరుగుల లక్ష్యాన్ని భారత్ 30.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తెలుగు ఆటగాడు షేక్ రషీద్ (26)తో పాటు రఘువంశీ (44) రాణించడంతో భారత్ పని సులువైంది. దీంతో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. క్వార్టర్ ఫైనల్‌లోనూ ఆల్‌రౌండ్ ఆటతీరును కనపరిచింది. కాగా సెమీఫైనల్‌లో భాగంగా ఫిబ్రవరి 2న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
