Site icon NTV Telugu

Yograj Singh: రోహిత్, విరాట్ ఎప్పుడు రిటైర్ అవ్వాలి?.. యూవీ తండ్రి కీలక ప్రకటన

Yogaraj

Yogaraj

ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వన్డేల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ జోరుగ చర్చ జరిగింది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా దీనిపైనే చర్చించుకున్నారు. అయితే ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ తర్వాత రోహిత్ అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టాడు. వన్డే ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలకబోనని ప్రకటించాడు. రిటైర్ మెంట్ ప్రచారాన్ని ఆపాలని మీడియాను కోరాడు. తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ రోహిత్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి కీలక ప్రకటన చేశారు.

Also Read:PM Modi: ప్రధాని మోడీకి మారిషన్ అత్యున్నత పురస్కారం.. 21 అంతర్జాతీయ పురస్కారం..

హిట్ మ్యాన్ వన్డేల నుంచి రిటైర్ కాకపోవడం పట్ల సంతోషంగా ఉన్నానని యోగరాజ్ తెలిపాడు. యోగరాజ్ భారత్ తరపున 6 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. యోగరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ రిటైర్ కాకపోవడం ఉత్తమ విషయం. రోహిత్, విరాట్ కోహ్లీలను ఎవరూ రిటైర్ చేయలేరు. వీరిద్దరు రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు ఎన్నేళ్లు కావాలంటే అన్నేళ్లు ఆడొచ్చని తెలిపాడు. 2027లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని అన్నాడు.

Also Read:Posani Krishna Murali: పోసానిపై మొత్తంగా 17 కేసులు.. అన్ని కేసుల్లో బెయిల్స్‌..

2027లో దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచ కప్ జరుగనున్నది. అప్పటికి రోహిత్ వయసు 40 పైనే ఉంటుంది. కోహ్లీ వయసు 38 పైనే ఉంటుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత 2027లో టోర్నమెంట్ ఆడటం గురించి రోహిత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 83 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. హిట్ మ్యాన్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు.

Exit mobile version