టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ కాసేపటి కిందట సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రకటనపై ఏపీలోని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజనీ అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.
Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!!
భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన సేవలకు వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ క్రికెట్‌లో బాగా రాణించాలని.. ఆయన మరింత రాణించి సెంచరీల మీద సెంచరీలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ట్వీట్ చేశారు. కాగా 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్‌గా నియమితుడైన కోహ్లీ ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం టెస్టులకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అకస్మాత్తుగా విరాట్ కోహ్లీ ప్రకటన చేయడంతో అతడి అభిమానులు నిరాశ చెందుతున్నారు.
