WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
- ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో న్యూజిలాండ్ విజయం
- డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్
- పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఇంగ్లండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Points Table 2025-27: ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌తో కివీస్ 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్ అవకాశాలు మరింత బలపడ్డాయి.
చివరి రోజు 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలువలేకపోయారు. 212 పరుగులకే ఆలౌటై 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడిపోయింది. కివీస్ తరఫున జాక్ ఫౌల్క్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. కివీస్ పాయింట్ల శాతం 72.22కి పెరిగింది. మరోవైపు సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ ఏడో స్థానంలోనే కొనసాగుతూ.. పాయింట్ల శాతం 24.36కి పడిపోయింది.
Also Read
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఆస్ట్రేలియా 87.50 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా 75.00 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉండి.. ఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా నిలిచింది. ఇంగ్లండ్ మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బంగ్లాదేశ్ (58.330) నాలుగో స్థానంలో ఉండగా.. భారత్ (48.150) ఐదవ స్థానంలో నిలిచింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. టీమిండియా ఏకంగా 9 మ్యాచులు ఆడి నాలుగు విజయాలే అందుకుంది. డబ్ల్యూటీసీ 2025-27లో టీమిండియా చాలా వెనుకంజలో ఉంది. ఈసారి కూడా భారత్ ఫైనల్ ఆడడం కష్టంగానే ఉంది.
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!