WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC 2025-27 Standings Update: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటుచేసుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఎనిమిది టెస్టులు ఆడి ఆరింటిలో విజయం సాధించింది. దీంతో ప్రొటీస్ పాయింట్ల శాతం 75కు చేరింది.
న్యూజిలాండ్ 72.22 శాతంతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 69.23 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ 51.52 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. తాజా ఓటమితో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం 40.74కు పడిపోయింది. అయినప్పటికీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఐదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు, ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌కు మధ్య పాయింట్ల శాతంలో వ్యత్యాసం స్వల్పంగానే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్, న్యూజిలాండ్ జట్లు కూడా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ సిరీస్ ఫలితాల ఆధారంగా రానున్న రోజుల్లో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మరోసారి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
Also Read
- Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
- Henry Nicholls: భారత్‌పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
- Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌటైంది. ఐదో రోజు ఆటను 100/5తో ప్రారంభించిన ఆ జట్టు.. లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్‌ల పోరాటంతో కొంతసేపు నిలబడింది. వీరిద్దరూ ఏడు ఓవర్లలో 34 పరుగులు జోడించారు. అయితే లిటన్ దాస్‌ను కగిసో రబడా బౌల్డ్ చేయడంతో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ తన స్పిన్ మాయాజాలంతో బంగ్లాదేశ్ మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టాడు. పిచ్ నుంచి లభించిన టర్న్‌ను ఉపయోగించుకున్న అతడు.. 51 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 168 పరుగుల వద్ద ముగిసింది.
దక్షిణాఫ్రికా విజయానికి కేవలం 12 పరుగులు అవసరం కాగా.. ఆ జట్టు 1.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన మార్కస్ అకెర్మన్ సున్నాకే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు ఐడెన్ మార్క్రమ్.. ఎబాడత్ హొస్సేన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికి బౌల్డ్ అయినప్పటికీ.. అది నోబాల్ కావడంతో అతడికి మరో అవకాశం లభించింది. ఎబాడత్ మరో నోబాల్ వేయగా, అనంతరం మార్క్రమ్ విజయానికి అవసరమైన పరుగును సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
-
Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
-
Astrology: నవంబర్ 20 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!