Team India: ఆసియా కప్‌లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. జడేజా గాయంతో దూరం కావడం ఆసియా కప్‌లో జట్టుకు తీవ్ర నష్టం చేసింది. జడేజా అందుబాటులో లేకపోవడంతో టీమ్ కాంబినేషన్ కూడా చెల్లా చెదురైంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా పరిస్థితుల నేపథ్యంలో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ దీపక్ హుడాను తీసుకున్నా అతడు ఏ మేరకు రాణిస్తాడన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Read Also: ఈ పండ్లను తీసుకోండి.. జుట్టు సమస్యలకి చెక్ పెట్టండి
అయితే ఆసియాకప్‌లో దీపక్ హుడా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. కాబట్టి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లకు అవకాశం ఇస్తే సత్తా చాటితే హుడాకు తిరుగుండదు. జడేజా స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వడం టీమిండియాకు కనిపిస్తున్న మరో అవకాశం. కానీ జడేజా తరహాలో అశ్విన్ బ్యాటింగ్‌లో రాణించలేడు. ఇది టీమ్‌కు నష్టం చేకూరుస్తుంది. టాపార్డర్ విఫలమైన చోట జడేజా ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నిర్మించగలడు. అశ్విన్ ఆ పని చేయలేడు. అటు జడేజా స్థానంలో దినేష్ కార్తీక్‌ను తీసుకోవడం మరో ప్రత్యామ్నాయంగా టీమిండియాకు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయగలిగినప్పుడే ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుంది. మొత్తానికి టీమ్ ప్లాన్ ఏంటనేది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
